బాబోయ్ మళ్ళీ శ్రీరెడ్డి అన్నంత పని చేసేసిందిగా

తనని వేశ్య అంటూ కామెంట్ చేసినందుకు దర్శక, నిర్మాత వారాహిపై చర్యలు తీసుకుంటా అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి చెప్పినట్టే చేసింది. చెన్నై పోలీసు కమిషనర్ లో శుక్రవారం ఆమె కంప్లైంట్ లెటర్ రాసి ఇచ్చింది. వారాహి తనకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. “సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి అమ్మాయిలను లైంగిక కోర్కెలు తీర్చుకోటానికి వాడుకుంటున్న వారి గురించి నేను బహిర్గతం చేస్తున్నాను. ఈ నెల 24 వ తేదీన దర్శక, నిర్మాత వారాహి మీడియా సమావేశంలో నన్ను వ్యభిచారిగా సంబోధించారు, న గురించి చేదుగా మాట్లాడారు. నాకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది నాకు ఇబ్బంది కలిగించింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను” అని ఆమె ఫిర్యాదు లేఖలో పేర్కొంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల లీక్స్ మొదలుపెట్టింది. దర్శక, నిర్మాత సుందర్ సి పై ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణల్లో నిజం లేవంటూ స్పందించిన సుందర్ ఆమెకు కోర్టు నోటీసులు పంపిస్తానంటూ శ్రీరెడ్డిని హెచ్చరించారు కూడా. మురుగదాస్, లారెన్స్ లపై ఆమె ఆరోపణలు చేసింది. వీటిపై గత 24 వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు వారాహి. ఆమె వేశ్య అంటూ కామెంట్స్ చేశారు. తనని వేశ్య అంటూ కామెంట్ చేసినందుకు వారాహిపై చర్యలు తీసుకుంటా అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి చెప్పినట్టే చేసింది.  గతంలో ఒకసారి ఫిలిం ఛాంబర్ ఎదుట బట్టలు లేకుండా నిరసన తెలుపుతా అని అలాగే అర్ధ నగ్న నిరసన చేసింది. ఇప్పుడు వారాహిపై కంప్లైంట్ చేస్తా అని అన్నంత పని చేసేసింది. ఫిమేల్ ఆర్టిస్టులపై లైంగిక వేధింపుల గురించి “నడిగర్ సంఘంలో” కంప్లైంట్ చేయాలనీ ప్రయత్నిస్తే అధ్యక్షుడు నాజర్, విశాల్, కార్తీక్ తనని పట్టించుకోలేదని తెలిపింది. 

సినిమాలు చేసినప్పుడు, షార్ట్ ఫిలిమ్స్ లో నటించినప్పుడు రాని గుర్తింపు కాస్టింగ్ కౌచ్ అంశం లేవనెత్తగానే వచ్చింది శ్రీరెడ్డికి. టాలీవుడ్ లో ఈమె లేవనెత్తిన చర్చ పెద్ద దుమారమే రేపింది. శ్రీశక్తిగా మహిళల కోసం పోరాడతాను అని ఉద్యమం చేపట్టింది కానీ పవన్ తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉద్యమాన్ని నీరు కార్చింది. అప్పటి వరకు తనకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఆమెను వ్యతిరేకించటం మొదలెట్టారు. మీడియా కూడా శ్రీరెడ్డిని పక్కన పెట్టేసింది. దీంతో తమిళ్ లీక్స్ మొదలెట్టి చెన్నైకి మకాం మార్చింది శ్రీరెడ్డి.