హిట్ ఇచ్చినా పట్టించుకోరా అని హాట్ ఫొటో వదిలింది

అవును…సాధారణంగా ఓ హిట్ సినిమా పడితే ఎవరైనా బిజీ అవుతారు. కానీ అదేంటో శోభిత ధూళిపాళ సిట్యువేషన్ వేరు. ఆమె కు గూఢచారి సినిమాతో హిట్ ఆమె వాకిట్లోకు వచ్చినా వచ్చి గుమ్మం తట్టి ..భుజం తట్టి తమ సినిమా లో బుక్ చేసుకునేవాళ్లు కనపడటం లేదు. అలాగని మరి ఆఫర్స్ రాని పరిస్దితి కాదు కానీ …ఆమె స్దాయికి తగ్గట్లు ఒకటీ రావటం లేదు. ఊరుపేరు లేని దర్శక,నిర్మాతలు ఆమెను టచ్ చేస్తున్నారట.

దాంతో ఆమె ఎవరికి ఓకే చెప్పాలో..అసలు ఆ సినిమాలు తీస్తారో…తీసినా రిలీజ్ అవుతాయో లేదో తెలియని పరిస్దితి. ఈ నేపధ్యంలో టైమ్ గడిచిపోతోంది. గూఢచారి సినిమాని మర్చిపోయి జనం వేరే సినిమాలు గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగని గూఢచారి సినిమా అప్పుడు కూడా స్పెషల్ గా ప్రమోట్ చేసుకోలేకపోయింది.


దాంతో తన సీనియర్స్ సలహా మేరకు సోషల్ మీడియాతో తనని మరోసారి సిని ప్రపంచం గుర్తుపెట్టుకునేలా చెయ్యాలని ఫిక్సైంది. ఇదిగో ఇలాంటి హాట్ ఫొటో వదిలింది. మరి ఈ ఫొటో తో అయినా జనం ఆమెకు ఆఫర్స్ ఇస్తారా..చూడాలి.