నీ కష్టం ఉత్తగనే పోదు!!.. రవికృష్ణకు శివజ్యోతి సలామ్

Shiva Jyothi Comments on Ravi Krishna Workouts

సీరియల్ యాక్టర్ రవికృష్ణ-న్యూస్ ప్రజెంటర్ శివజ్యోతిది బిగ్ బాస్ కలిపిన బంధం. ఈ షోలో ఇంతవరకు ఇంతలా కలిసిపోయిన బంధం, ఇంత ఆప్యాయంగా ఉన్న కంటెస్టెంట్లు మరొకరు లేరు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్స్‌లోనూ రవికృష్ణ-శివజ్యోతి-హిమజ ఇలా వీరంతా నేటికీ ఓ జట్టుగానే ఉంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా శివజ్యోతి-రవికృష్ణల ఎమోషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో షోలో ప్రత్యక్షంగా మనమంతా చూశాం

Shiva Jyothi
Shiva Jyothi

పాతాళగంగగా పేరు తెచ్చుకున్న శివజ్యోతి అలి రెజా, రవి ఎలిమినేషన్‌లు జరిగినప్పుడు ఎంత సీన్ చేసిందో అందరం చూశాం. ఎవరో చనిపోయినంతగా ఏడ్చేసింది. ఆ సందర్భంలో హౌస్ మేట్స్‌తో, వీక్షకులు సైతం అదే రకమైన ఫీలింగ్‌లో ఉన్నారు. బయటకు వచ్చాక కూడా శివజ్యోతి అంతే ప్రేమగా వారితో ఉంటుంది. అంతా సొంతింటి వాళ్లే అన్నట్టుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ లాక్ డౌన్‌లో అయితే రవికృష్ణ, హిమజ అందరూ కూడా శివజ్యోతి ఇంట్లోనే గడిపినట్టు కనిపిస్తోంది.

Ravi Krishna Workouts
Ravi Krishna Workouts

రవికృష్ణ కరోనా బారిన పడి కోలుకున్న తరువాత విపరీతంగా కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. ఓ రేంజ్‌లో వర్కౌట్లు చేసి సిక్స్ ప్యాక్ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా రవికృష్ణ వర్కౌట్లపై శివజ్యోతి స్పందిస్తూ.. ‘నీ కష్టం ఉత్తగనే పోదు నాని.. నాకు తెలుసు ఈ ఫిట్‌నెస్ కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నవో నాకు తెలుసు. ఎంతో డెడికేట్‌తో చేస్తున్నావ్.. ఇలా ముందుకు వెళ్లు నాన్న’ అంటూ సలామ్ కొట్టింది.

Ravi Krishna, Shiva Jyothi, Bigg Boss 3 Telugu, రవికృష్ణ, శివ జ్యోతి, బిగ్ బాస్