Dhandoraa: మంచి సినిమాలకు ఎప్పుడూ మద్ధతుగా నిలిచే స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘దండోరా’ సినిమాను చూశారు. కథ, కథనం, పాత్రల తీరు తెన్నులు, సాంకేతిక నిపుణుల పనితీరు అన్ని ఆయనకు చాలా బాగా నచ్చాయి. దీంతో ఆయన తన ఎక్స్(ట్విట్టర్)లో ‘‘నేను ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. చాలా లోతుగా, బలమైన ఆలోచనలకు దారి తీసేలా రూపొందించిన సినిమా ఇది. శివాజీ గారు, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి…. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. దీన్నొక రూటెడ్ కథగా, అద్భుతంగా రాసి తెరకెక్కించిన డైరెక్టర్ మురళీ కాంత్ గారికి నా అభినందనలు. అలాగే ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక బృందానికి హృదయపూర్వక అభినందనలు’’ అని ‘దండోరా’ చిత్ర యూనిట్‌ను అభినందించారు ఎన్టీఆర్.
https://x.com/tarak9999/status/2013260865265689064

సంయుక్త ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ నేపథ్యంతో రూటెడ్ కథాంశంతో ‘దండోరా’ సినిమా రూపొందింది. కలర్ ఫొటో, ‘బెదురులంక 2012’ వంటి డిఫరెంట్ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని దండోరా సినిమాను నిర్మించారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజైంది. మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఇంకా కొన్నిచోట్ల కొనసాగుతోన్న కుల వివక్షను ప్రశ్నించేలా, అందరినీ ఆలోచింప చేసేలా రూపొందిన సినిమా ఇది. మార్క్ కె.రాబిన్ సంగీతం, నేపథ్య సంగీతం..వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మెప్పించాయి.
https://www.primevideo.com/detail/0FOHKSENDRR92L30AYMUT1OLWU/
ఇప్పుడు దండోరా చిత్రం ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్‌లో జనవరి నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

