రామ్‌చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ పోస్టర్ చూడగానే పండుగ ముందే వచ్చిన ఫీలింగ్ వచ్చింది.
మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో రామ్ చరణ్ మాస్ లుక్ దుమ్ము రేపుతోంది. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి అంతా ..నవంబర్ 9న విడుదల కానున్న టీజర్ పైనే ఉంది.
ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటించారు. ఇటీవల సినిమా షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇందులో విలన్ పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.