కరోనా వైరస్ తో పోరాడుతున్న టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు(64) శనివారం ఉదయదం కన్ను మూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోరోనా పాజిటివ్ రావడంతో కొద్ది రోజులుగా హోమ్ క్వారైంటన్ లో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మృతితో టాలీవుడ్ షాక్ అయింది. పోకూరి రామారావుకి కరోనా సోకిందన్న విషయం మీడియాలో ఎక్కడా వైరల్ అవ్వలేదు. బండ్ల గణేష్ సహా ఓ నిర్మాత, పలువురు టీవీ ఆర్టిస్టుల పేర్లు తెరపైకి వచ్చాయి తప్ప రామారావు పేరు ఎక్కడా వినిపించలేదు.
దీంతో రామారావు మృతి షాకింగ్ డెత్ గా అనిపిస్తోంది. ఈ వార్తతో టాలీవుడ్ దిగ్బ్రాంతికి గురైంది. రామారావు మరణంపై సినీ పరిశ్రమలకు చెందిన అన్ని శాఖలు సంతాపాన్ని ప్రకటించాయి. ఓ నిర్మాత ఇలా కరోనా మహమ్మారి బారిన పడి చనిపోతారనుకోలేదని దిగ్ర్భాంతికి లోనవుతున్నారు. రామారావుకి కరోనా సోకడంతో కుటుంబం మొత్తానికి కొవిడ్ పరీక్షలు చేసారు. వాళ్లంతా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. ఇక పోకూరి రామారావు సోదరుడు బాబురావు ఈతరం ఫిలింస్ పై ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. నేటి భారతం, ఎర్రమందారం, యజ్ఞం, రణం వంటి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అందులో రామారావు భాగస్వామిగా కొనసాగారు. టాలీవుడ్ లో నిర్మాతగా ఆయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి.