‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ పై నెగిటివ్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో… శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా మూడు భాషల్లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోందీ చిత్రం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ రోజు (మార్చి 3న) షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2 అంటూ ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసారు.

ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా ఈ టీజర్ ను విడుదలచేసారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

Saaho | Shades Of Saaho | Chapter 2 | Prabhas | Shraddha Kapoor | Sujeeth | #HappyBirthdayShraddha

ఇక ఈ టీజర్ చూసిన జనం పబ్ జి గేమ్ ని చూస్తున్న ఫీలింగ్ వచ్చిందంటున్నారు. అయితే కొందరు అదే పాజిటివ్ ఎలిమెంట్ అని, తెలుగులో హాలీవుడ్ స్దాయి చిత్రమని మెచ్చుకుంటున్నారు. పబ్ జి గేమ్ లో AKM, M16A4, M416, SCAR-L, S12K, వంటి గన్ ల గురించి ఉంటుంది. సాహోలోనూ అదే స్దాయిలో గన్స్ ఉన్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… . అత్యున్నత సాంకేతిక పరిజ్ఙానంతో ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్, గ్రాఫిక్స్ సంభ్రమాశ్చర్యాల్ని కలిగించే స్థాయిలో ఉండనున్నాయి. ప్రభాస్ స్టైలిష్ నటన, దర్శకుడు సుజిత్ టేకింగ్, శ్రద్ధాకపూర్ గ్లామర్, శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం చిత్రానికి ప్రధాన హైలైట్స్‌గా నిలవనున్నాయి అన్నారు.