ఇండస్ట్రీ టాక్ : ఫైనల్ గా “ఆదిపురుష్” ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే.!

పాన్ ఇండియా సినిమా దగ్గర మళ్ళీ ప్రభాస్ రేంజ్ హిట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హిట్ మాత్రం తాను నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ ట్రీట్ “ఆదిపురుష్” తోనే అవుతుంది అని అంతా అనుకుంటున్నారు.

అయితే తాను హీరోగా చేసిన ఈ భారీ పీరియాడిక్ వండర్ లో తాను శ్రీరామునిగా నటించగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి దేవిగా నటించింది. అలాగే ఓంరౌత్ అయితే దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పటివరకు సినిమా చేస్తున్న మేకర్స్ కి తప్ప ఇంకెవరికీ తెలీదు.

దీనితో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై అందరిలో మంచి అంచనాలు ఆసక్తి నమోదు అయ్యాయి. అయితే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ ని అయితే మేకర్స్ ఫైనల్ గా ఈ సెప్టెంబర్ నెల లోనే రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నారట. ఇది ప్రభాస్ వర్గాల నుంచి కూడా గట్టిగా వినిపిస్తున్న సమాచారం.

దీనితో అయితే క్రేజీ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ నెలలో విడుదల అవుతుంది అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటించగా 3డిలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అలాగే 2023 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ భాషలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.