తెలుగు సినిమా దగ్గర గొప్ప సేవాగుణం ఉన్నటువంటి స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే తమ కెరీర్ పరంగా ఇప్పుడు నుంచో ఎప్పుడు నుంచో చేస్తున్న వారు ఏమో కానీ మెగా కుటుంబం నుంచి అయితే మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఎప్పుడు కూడా ముందుంటారు.
అయితే పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు కూడా పలు కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా ఎన్నో సార్లు సాయాలు గుప్త దానాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి ఒక గుప్త సాయాన్ని పవన్ నటించిన “తమ్ముడు” సినిమా విలన్ భూపిందర్ సింగ్ తాజాగా సోషల్ మీడియాలో చెప్పడం ఆసక్తిగా మారింది.
ఆ సినిమా టైం లో ముంబై నుంచి హైదరాబాద్ కి తాను రావాల్సి వచ్చింది అని అయితే ఆ టైం లో హైదరాబాద్ కి బాగానే వచ్చాను కానీ రిటర్న్ అవ్వడానికి ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్ 25000 రూపాయలు డబ్బు అలాగే టికెట్ కూడా ఇచ్చి పంపించారు అని తెలిపాడు.
దీనితో ఈ కొత్త ఎవరికీ తెలియని సహాయాన్ని ఈ నటుడు వెల్లడి చేయడంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానుల్లో వైరల్ గా మారింది. దీనితో పవన్ ఇప్పుడేదో రాజకీయాల్లోకి వచ్చి సాయం చేస్తున్నాడని కాదని అప్పటి నుంచే ఇలాంటి గుణం కలిగిన వాడు అని ఫ్యాన్స్ కొందరికి కౌంటర్ ఇస్తున్నారు.
To watch my first success, Tom Sir coaxed me to catch the midnight train to Hyderabad and watch the craze in person. To return Pawan gave me 25000 and a return ticket.
Though I'm trying hard to remember us going for it in Mumbai.— Bhupinder Singh (@BhupinderPSingh) August 26, 2022