Thammudu: తమ్ముడు సినిమా రిలీజ్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మేకర్స్.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పదంటూ!

Thammudu: శ్రీరామ్ వేణు దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా తమ్ముడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరబ్ సచ్ దేవ్ పలువురు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్,టీజర్,ట్రైలర్,వంటివి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా హైప్ నెలకొంది.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అవుతున్న సమయంలో రిలీజ్ కి ముందే మూవీ మేకర్స్ ఒక కీలక ప్రకటన చేశారు. అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే సినిమాను టార్గెట్ చేస్తూ.. ఎలా ఉన్నా కూడా నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్ చేసి నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాను దెబ్బతీసే ఉద్దేశ్యంతో అగౌరవపరిచే రివ్యూస్ ఇస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని నిర్మాతలు ముందుగానే హెచ్చరించారు.

బాధ్యతాయుతమైన విమర్శలకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ సినిమాను కావాలని దెబ్బతీసే లక్ష్యంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని తమ్ముడు చిత్ర బృందం హెచ్చరించింది. ఇటీవల కాలంలో కొంతమంది పేటీఎం బ్యాచ్లు సినిమా బాగున్నా కూడా బాగోలేదంటూ సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. దాంతో థియేటర్లకు వచ్చేవారు ఆ నెగటివ్ ఫీడ్ బ్యాక్ చూసి రావడం మానేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా సినిమాల విషయంలో ఇదే జరుగుతుండడంతో తమ్ముడు సినిమా మూవీ మేకర్స్ ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నారు.