అందరూ భుజాలపై మోసారంటూ ఎన్టీఆర్

ఎన్టీఆర్ హీరో గా నటించిన  ‘అరవింద సమేత వీరరాఘవ’ నిన్నటి రోజు విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం చూసిన వారంతా.. ఎన్టీఆర్‌ నటన, త్రివిక్రమ్‌ డైలాగులును   మెచ్చుకుంటున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ ఉద్దేశించి ట్వీట్ చేసారు

 

‘ఇలాంటి సమయంలో అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అదే విధంగా చినబాబుగారికి, నాగవంశీ, పూజాహెగ్డే, జగపతిబాబు, తమన్‌, పెంచల్‌ దాస్‌, పీఎస్‌ వినోద్‌, నవీన్‌నూలి, రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్స్‌ సహా ‘అరవింద సమేత వీర రాఘవ’కు పని చేసిన ప్రతి సభ్యుడూ చిత్రాన్ని తమ భుజస్కందాలపై మోశారు. వారందరికీ ధన్యవాదాలు.

సినిమాపై మీరు చూపిస్తున్న ఆదరణ, ప్రేమను మర్చిపోలేను. దృఢ సంకల్పంతో పనిచేసిన త్రివిక్రమ్‌గారు లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు’’ అని వరుస ట్వీట్ల ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం … తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి ఓపినింగ్స్ సంపాదించుకుంది.  ‘అరవింద సమేత వీర రాఘవ’..ఎన్టీఆర్ గత చిత్రాల రికార్డ్ లను బ్రద్దలు చేస్తుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.