‘యన్‌.టి.ఆర్‌’బయోపిక్: ఫస్ట్ సాంగ్ ..వచ్చేసింది, అదిరిపోయింది!

‘యన్‌.టి.ఆర్‌’బయోపిక్ నుంచి నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ‘ఘ‌న‌ కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా ఓ క‌థానాయకా’.. అంటూ నందమూరి తారకరామారావు గొప్పతనాన్ని వర్ణిస్తూ.. సాగిన పాట ఇప్పుడు అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించగా .. ఆయన తండ్రి శివ శక్తి దత్తా, పెద నాన్న కే రామకృష్ణలు సాహిత్యం అందించారు. ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాటకు ప్రాణం పోశారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్‌. అందులో భాగంగానే ఈ పాటను రిలీజ్ చేశారు.

Kathanayaka Full Song With Lyrics | NTR Biopic Songs - Nandamuri Balakrishna | MM Keeravaani

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ ఎన్టీఆర్‌ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్‌, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్‌ కానుంది.