నాగబాబు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తన కామెంట్ల బాణాలు వదులుతూనే ఉన్నారు. కౌంటర్స్ ఇస్తూ మీడియా, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వరసగా బాలయ్యను టార్గెట్ చేసిన నాగబాబు.. అసలు తానెందుకు ఇలా చేస్తున్నానో.. నా కామెంట్స్ అంటూ వీడియోల రూపంలో చెబుతున్నారు. ఇప్పటికే రెండు కామెంట్లను విడుదల చేసిన నాగబాబు.. తాజాగా మరో కామెంట్ వదిరారు.
నాగబాబు మాట్లాడుతూ.. ‘‘అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? అనే మాట మీరు మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అంత పెద్ద స్టార్. కన్నడ రాజకుమార్, ఎంజీఆర్ కూడా అంత పెద్ద స్టార్లు. ఇంచుమించు మీ తండ్రి వయసున్న వ్యక్తులు వారు. అలాంటి వ్యక్తిని ఏం పీకారు అన్నపుడే చాలా భాదనిపించింది. సరే మాకెందుకులే అని ఊరుకున్నాం. ఆ తర్వాత చిరంజీవి ఏమయ్యాడు అన్నారు.
మీ టాపిక్‌లో మా పేరు అవసరమా మీకు? ఓకే అన్నారు.. దానికి కూడా మాకు అబ్‌జెక్షన్ లేదు. కానీ మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.. అన్నారు మీరు. ఏంటి మీరేమన్నా ఆకాశం నుంచి దిగివచ్చారా? లేకపోతే మీరేమయినా సూర్య వంశీకులా? మమ్మల్ని అవమానిస్తే మాకు కోపం రాదా? ఎవరైతే బాలకృష్ణను అన్నందుకు ఫీల్ అవుతున్నారో.. చెబుతున్నా.. ముందు అవతలి వ్యక్తి ఎన్ని కామెంట్లు చేశాడో తెలుసుకోండి’’ అని నాగబాబు అన్నారు.
బ్లడ్, బ్రీడ్ మనుషులు చూస్తారా! అసలు అని ప్రశ్నిస్తూ అది కరెక్టా? అని నాగబాబు ప్రశ్నించారు. మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.. అని మిగితా వారిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోమని చెప్పారు. అయినా సైలెంట్‌గా ఉన్నాం. ఎందుకంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు కామెంట్లు చేయటం ఇష్టముండదు కాబట్టి.. అని అన్నారు.
ఇక చివరగా.. ‘‘మీరూ మాలాగే మనుషులు, మీరు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టారు.. మీరేమీ దైవాంశ సంభూతులు కాదు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ముగించారు నాగబాబు.