మెగా బ్రదర్ నాగబాబుకు తన అన్నయ్య చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నయ్యను ఎవరైనా పల్లెత్తు మాట అంటే కూడా సహించని ఓ భరతుడు, ఓ లక్ష్మణుడు వంటి వాడు నాగబాబు. యాంగ్రీమెన్‌గా నాగబాబు మెగా ఫ్యామిలీని రక్షించే అడ్డుగోడలా ఉంటాడు. చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడే వారిపై విరుచుకుపడే నాగబాబు.. అన్నపై ఆకాంశమంతా ప్రేమను కురిపించాడు. నేడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా నాగబాబు పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా నాగబాబు ఓ పోస్ట్ చేశాడు. అందులోని సారాంశం ఏంటంటే.. ‘పండుగ మొదలైంది.. కొన్ని మిలియన్ల హృదయాల్లో వెలుగు పంచే స్టార్.. నేను నమ్మే ఏకైక దైవం మా అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ప్రాణాలతో ఈ భూమిపై దేవుడు మనిషిలా నడియాడు అంటే అది మా అన్నయ్యే. ఒక వేళ నువ్వే గనుక లేకపోతే మా జీవితాలు ఇలా ఉండేవే కావు. నీవు చూపించే అనంతమైన ప్రేమ, నిరంతర కఠోర శ్రమ వల్లే నాకు ఈ సంపద కలిగింది.
కింద పడిపోతానన్న భయం నాకెప్పుడూ కలగలేదు ఎందుకుంటే నన్ను మళ్లీ పైకి లేపడానికి నువ్ ఉన్నావన్న ధైర్యం నాకుంది. అదే నాకు బలాన్ని ఇచ్చింది.. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అదే కారణం. నా జీవితపు ఒడిదుడుకుల్లో వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఎక్కువగా ఏమీ అడగలేను, నేను అడగకుండానే నాకు దొరికిన అతి గొప్ప బహుమతి మీరు. బంధాలు, బంధనాల కంటే ఎక్కువగా ప్రేమను, జాగ్రత్తలను మాకు పంచారు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొన్నాడు.