Boyapati srinu: ఆ హీరోతో సినిమా… బోయ పాటిని ఇబ్బందులలో పడేయనుందా?

Boyapati srinu:అఖండ సినిమా తర్వాత మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటి శీను తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేస్తారనే ఆతృత ప్రతి ఒక్కరిలో నెలకొంది.ఈ క్రమంలో బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చినప్పటికీ ఈయనతో సినిమా తీసేలోగా బోయపాటి మరొక హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా బోయపాటి సినిమాలకు కేవలం కొందరు హీరోలు మాత్రమే సెట్ అవుతారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ బాలకృష్ణ వంటివారు ఒకరు.

వీరితో కాకుండా బోయపాటి మరే హీరోలతో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను ఎదుర్కొంటుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం.అయితే అఖండ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలని భావించిన బోయపాటి మరొక సంవత్సరం పాటు వేచి చూడాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ పుష్ప పార్టు2 చిత్రీకరణలో బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే బోయపాటి మరొక హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ ద్వారా మాస్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ పోతినేని తో బోయపాటి సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోపై కథపై వందశాతం నమ్మకం ఉంటేనే బోయపాటి ముందుకు వెళితే మంచిదని లేదంటే అతను ఇబ్బందులలో పడే అవకాశాలు ఉంటాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చే సినిమా సక్సెస్ అయితే బోయపాటి అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ఈ సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ సినిమా ఉండదని అప్పుడు బోయపాటి పూర్తిగా ఇబ్బందుల్లో పడతారని తెలుస్తోంది. మరి బోయపాటి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది.