చిరంజీవికి మోహన్ బాబు బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు

mohan babu sends rare gift to chiranjeevi on his birthday

చిరంజీవి, మోహన్ బాబు.. ఇద్దరూ పాత మిత్రులే. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఇద్దరి సినీ ప్రయాణం ఇంచుమించుగా ఒకేసారి ప్రారంభం అయింది. ఆ మధ్య కొన్ని రోజులు వీళ్ల మధ్య పొసగలేదు. కొన్ని రోజులు ఎడమొహం, పెడమొహం పెట్టుకున్న వీళ్లు మళ్లీ కలిశారు. ఆ తర్వాత ఏ సినీ వేడుకల్లో చూసినా వాళ్లిద్దరి ఆప్యాయత మామూలుగా లేదు.

mohan babu sends rare gift to chiranjeevi on his birthday
mohan babu sends rare gift to chiranjeevi on his birthday

నిజానికి మోహన్ బాబు.. చిరంజీవి కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. చిరంజీవి కంటే కూడా విభిన్నమైన పాత్రలు చేశాడు. ఎన్నో హిట్లు.. కానీ.. చిరంజీవి అంత సక్సెస్ కాలేకపోయాడు.

1974లో మోహన్ బాబు కన్నవారి కలలు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. చిరంజీవి మాత్రం 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కొన్ని చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు విలన్ గానూ నటించారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య బంధం మరింత గట్టిపడింది అని తెలుసు కదా. అందుకేనేమో.. చిరంజీవి బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు… తన మిత్రుడు చిరంజీవికి అరుదైన గిఫ్ట్ ను పంపించాడు.

mohan babu sends rare gift to chiranjeevi on his birthday
mohan babu sends rare gift to chiranjeevi on his birthday

అవేంజర్స్ బైక్ ఆకారంలో ఉన్న వుడెన్ బైక్ ను మోహన్ బాబు గిఫ్ట్ గా పంపించారు. దానికి సంతోషించిన చిరంజీవి.. ఆ బైక్ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు.. ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి.. థాంక్యూ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.