వైరల్ : ఈ బర్త్ డే కి ఎమోషనల్ అనౌన్సమెంట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.!

తెలుగు చిత్ర పరిశ్రమ దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఉన్నటువంటి ఏకైక మెగాస్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి అని మాత్రమే అని చెప్పాలి. తన కెరీర్ లో ఇప్పటివరకు చూడని సక్సెస్ చూడని ఓటమి కూడా లేదు.

సినిమాలతో పాటుగా రాజకీయాల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి చూడనిది కూడా దీనితో మళ్ళీ చిరు సినిమాల్లోకి వచ్చారు. అయితే చిరు తెరవెనక కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ సంగతి కూడా చాలా మందికి తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ఒక ఊహించని ఎమోషనల్ అనౌన్సమెంట్ ని అయితే అందించడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. తాను ఓ కార్యక్రమం రీత్యా విదేశాలకు వెళ్లగా అక్కడ మెగాస్టార్ ఈ అనౌన్సమెంట్ అందించారు.

తెలుగు సినీ కార్మికుల కోసం హైదరాబాద్ చిత్రపురి లో ఓ హాస్పిటల్ ని వారికోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నాను అని ఈ బర్త్ డే కి నేను మాటిస్తున్నానని వచ్చే ఏడాది మళ్ళీ నా పుట్టినరోజు నాటికి ఆ హాస్పిటల్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. దీనితో చిరు చేసిన ఈ ఎమోషనల్ అనౌన్సమెంట్ సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.