ఇండియన్ పనోరమ చిత్రోత్సవంలో “మహానటి “

49 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం   భారతీయ పనోరమ  ప్రధాన విభాగంలో మహానటి సినిమా ఎంపికయ్యింది .గోవా లో జరిగే ఈ అంతర్జాతియ చలన చిత్రోత్సవం  పనోరమా విభాగంలో  13 మంది సభ్యులున్నారు .  చైర్మన్ గా  మేజర్  రవి , సభ్యులుగా  అహతియాన్ ,  ఉజ్జ్వల్ ఛటర్జీ , ఇమో సింగ్ , ఉత్పల్ దత్ , శేఖర్ దాస్ , మహేంద్ర తెరేదేశాయి ,  హైదర్ అలీ , కె జి . సురేష్ , చంద్ర సిద్దార్థ , అదీప్  టాండన్ , ఎస్ . విశ్వనాధ్  వున్నారు .

ఈ కమిటీ  భారత దేశంలో వున్నా వివిధ భాషల్లో వచ్చిన వాటి నుంచి  22 చిత్రాలను ఎంపిక చేసింది . వీటిల్లో “ఓలు” అనే మలయాళ సినిమా పనోరమా ప్రారంభ సినిమాగా ఉంటుంది . మిగతా చిత్రాల్లో  బెంగాలీ సినిమా నాగరికిటన్ ,  సా , ఉమా , అబ్యాక్తో , యూరోన్చోండి ,హిందీ నుంచి  అక్టోబర్, బోర్ , జేసారా  నుంచి సింజార్ ,లడఖి  నుంచి  వాకింగ్ విత్ ది విండ్ , మలయాళం నుంచి భయానకం , మక్కన ,పూమరం , సుందని ఫ్రొం నైజీరియా , ఈ మా యోవే , మరాఠీ  నుంచి  దప్ప , అంభి దొఘి ,  తమిళం నుంచి  టు లెట్ , భారం , పెరియరుమ్ పెరుమాళ్  బి ఏ ,బి ఎల్ , పెరంబు , తులు నుంచి  పెద్దయి  ఎంపికయ్యాయి .

ఇక ప్రధాన విభాగంలో ప్రదర్శనకు తెలుగు భాష నుంచి మహానటి సావిత్రి జీవితం పై నిర్మించిన నాగ్ అశ్విన్ ” మహానటి ”  హిందీ నుంచి “టైగర్ జిందా హై “. “పద్మావతి “,  “రాజీ  ” చిత్రాలు ఎంపికయ్యాయి .