జయలలిత బయోపిక్ వచ్చేస్తోంది

ఇది బయోపిక్ ల కాలం అని చెప్పవచ్చు . మహానటి సావిత్రి జీవితంపై నిర్మించిన “మహానటి ” సినిమాకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బ్రహ్మ రథం పట్టారు . ప్రస్తుతం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ జీవిత కథను యాత్ర పేరుతో తెరకెక్కుస్తున్నారు . మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డిగా నటిస్తున్నాడు . మహానటుడు , నాయకుడు ఎన్టీ రామారావు జీవిత కథను ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మిస్తున్నాడు . ఎన్టీఆర్ పేరుతో ఈసినిమా ముస్తాబవుతోంది .
దక్షిణ భారత దేశంలో నటిగా , గ్లామర్ తారగా పేరు తెచ్చుకున్న జయలలిత జీవిత కథ వేడితెరపై రాబోతున్నది . తమిళ రాజకీయాలను శాసించిన జయలలిత కేంద్ర రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించింది .
అనూహ్య పరిస్థితుల్లో 2016 డిసెంబర్ 5న కన్ను మూశారు . ఇప్పుడు ఈమె జీవిత చరిత్రను పేపర్ టేల్ పిక్చర్స్ వారు “ది ఐరన్ లేడీ ” పేరుతో తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో శరత్ కుమార్ కుమార్తె వర లక్ష్మి జయలలిత పాత్ర పోషిస్తున్నారు . ఫస్ట్ లుక్ విడుదలయ్యింది . దీనిని ప్రియదర్శని ఫిలిం సమర్పిస్తుంది . తమిళ నాట జయలలితను అమ్మగా పిలుస్తారు .