ఇన్సైడ్ రిపోర్ట్స్ : చిరు “గాడ్ ఫాధర్” ఇప్పటివరకు ఎలా వచ్చిందంటే..!

ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కి అయితే ఒక నైట్ మేర్ అని చెప్పాలి. స్టార్టింగ్ లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” హిట్ తో మంచి ఊపు వచ్చినా నెక్స్ట్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ సినిమా ట్రిపుల్ (RRR) తో తార స్థాయిలో సక్సెస్ ని అందుకున్నారు.

అయితే ఇది పాతాళానికి పడిపోడానికి కూడా మెగా హీరోస్ ఎంతో సమయం తీసుకోలేదు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న భారీ చిత్రం “ఆచార్య” ఎపిక్ డిజాస్టర్ తో జన్మలో మర్చిపోలేని చేదు అనుభవం ఒకొక్కరికీ ఎదురయ్యింది. ఇక దీనితో అయితే నెక్స్ట్ మెగాస్టార్ చేస్తున్న మరో భారీ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్” పై అందరి కళ్ళు పడ్డాయి.

మరి ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాపై అయితే ఇండస్ట్రీ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ అంతా ఎక్కడా తడబడకుండా పెద్దగా ఆన్ సెట్స్ లో మార్పులు లేకుండా వచ్చిందట. అలాగే సినిమా అవుట్ పుట్ కూడా ప్రామిసింగ్ గా వచ్చింది అని మెగా కాంపౌండ్ సినీ వర్గాల వారు అంటున్నారు.

దీనితో అయితే మెగాస్టార్ మాస్ కం బ్యాక్ మళ్ళీ ఈ ఏడాదిలో డెఫినెట్ గా ఉంటుందని ఇన్సైడ్ టాక్. మరి ఈ రిపోర్ట్స్ ప్రకారం సినిమా ఆ లెవెల్లోనే ఉంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.