డిజిటల్ ఓటీటీ సమావేశం ఎందుకు?
ఇకపై డిజిటల్ కంటెంట్‌కు సర్టిఫికేషన్ తప్పని సరి కానుందా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. డిజిటల్ మీడియా ప్రపంచం వట వృక్షంగా వేళ్లూనుకుంటోంది. ఇక్కడ ఎలాంటి సెన్సార్ లేదు. దీంతో డిజిటల్ కంటెంట్ చూడటానికి నెట్టింట్లో సెర్చ్ అనూహ్యంగా ఉందిప్పుడు. ఇక డిజిటల్ మాధ్యమం పెరిగిన దగ్గరి నుంచి నెట్ ఫిక్స్ సహా పలు మాధ్యమాలకు మన దేశంలో మరింత ఆధారణ మొదలైంది. వీటి వెల్లువతో పాటే అశ్లీలత అంతే ఇదిగా పెరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కేంద్రం డిజిటల్ కంటెంట్ పై ఆంక్షలు విధించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియాలో సినిమాలకు తప్ప డిజిటల్ కంటెంట్‌కు సెన్సార్ అనేది లేదు. దానికి ప్రత్యేకంగా ఎలాంటి యంత్రాంగం కూడా లేకపోవడంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్ బూతుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. యూట్యూబ్ కంటెంట్ మరీ దారుణంగా మారింది. సినిమాల్లో కట్ అయిన సన్నివేశాలన్నీ డిజిటల్ మీడియాలో చూపించే వీలుంటోంది కాబట్టి బూతు మరీ పెట్రేగింది. ఇప్పుడు దానిపై కేంద్రం కొరడా ఝుళిపించడానికి సిద్ధమవుతోంది.ఇకపై డిజిటల్ మాధ్యమంలోనూ నెట్ ఫిక్స్‌లోనూ ప్రసారమయ్యే సినిమాలకు కూడా సెన్సార్ ని అప్లయ్ చేయబోతున్నారు.
యూట్యూబ్ కంటెంట్ పైనా సెన్సార్ రూల్స్!
ఇప్పటికే దీనిపై సెంట్రల్ బ్రోడ్ కాస్టింగ్ మినిస్ట్రీ డిజిట్ సెన్సార్ షిప్ కు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే అసభ్యకర కంటెంట్‌కు కత్తెరపడినట్లే. దీనికితోడు క్రియేటర్స్‌కి కావాల్సినంత పని దొరకడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే యూట్యూబ్ ని ఇష్టానుసారం వాడేయడానికి ఇకపై కుదరదు. పద్ధతైన కంటెంట్ కే ఇకపై వెసులుబాటు పెరుగుతుంది. ఇది సిసలైన మీడియాకి ఊతమిస్తుందనడంలో సందేహం లేదు.