“కేజీఎఫ్” కి ముప్పా..?టీజర్ తో సెన్సేషన్ రేపిన కన్నడ భారీ సినిమా “కబ్జ”.. కానీ..!

ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మన తెలుగు సినిమాలు కన్నడ సినిమాలు అందుకొని రేంజ్ లో తమిళ్ సినిమా ఇండస్ట్రీ సెన్సేషన్ రేపేది. అయితే ఇప్పుడు టైం ,అణా వైపు రాగ తెలుగు సినిమాల డామినేషన్ భారీ లెవెల్లో స్టార్ట్ కాగా ఇక దానితో పాటుగా కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో వసూళ్లతో రికార్డు గ్రాసర్స్ లా నిలుస్తున్నాయి.

దీనితో ఓ రకంగా ఇపుడు కన్నడ ఇండస్ట్రీ కూడా “రైజ్” అవుతుందని చెప్పాలి. అయితే ఈ కన్నడ సినిమా సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ “కేజీఎఫ్” కి ముందు కేజీఎఫ్ కి తర్వాత అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ నుంచి కన్నడ ఇండస్ట్రీ లో కూడా పాన్ ఇండియా సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో అనౌన్స్ అవుతున్నాయి.

సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ రేపేందుకు సిద్ధం అయ్యిన మరో సినిమానే “కబ్జ”. కన్నడ రియల్ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి నిన్ననే ఒక క్రేజీ టీజర్ ని అయితే రిలీజ్ చేశారు.

ఇక ఇది చూసాక కన్నడిగులు మళ్ళీ కన్నడ సినిమా సత్తా పాన్ ఇండియా లెవెల్లో చాటే సమయం వచ్చింది అని అంటున్నారు. వాళ్ళు అన్నట్టే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ తో చాలా గ్రాండియర్ గా ఈ టీజర్ కనిపిస్తుంది. ఉపేంద్ర కూడా మంచి డాషింగ్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు పైగా బాద్షా కిచ్చా సుదీప్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు దీనితో కన్నడ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు కానీ….

మన తెలుగు సహా ఇతర భాషల ఆడియెన్స్ కి మాత్రం ఏఈ సినిమా టీజర్ చూసాక మళ్ళీ చూసిన సినిమా ఎందుకు చూడడం అని అంటున్నారు. ఇది నిజమే మరి ఏఈ టీజర్ చూసాక చూపించిన ప్రతి షాట్ కూడా రాకింగ్ స్టార్ యాష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా “కేజీఎఫ్” సినిమాలో చూసినదే..

ఒకోసారి అయితే కేజీఎఫ్ టీజర్ కానీ చూస్తున్నామా అనిపిస్తుంది. దీనితో కేజీఎఫ్ సినిమా చూసేసాం కదా మళ్ళీ అదే కథతో ఎందుకు తీస్తున్నారని అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి.పైగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకడాయే.. అయితే కన్నడ వరకు కేజీఎఫ్ వసూళ్లకు ముప్పు అంటున్నారు కానీ మక్కి మక్కీ కేజీఎఫ్ లానే అనిపిస్తున్న ఈ భారీ సినిమా  ఉంటుందో ఆగి చూడాలి.