మళ్ళీ కావాలని కాంట్రవర్సీ చేసుకుంటున్న అనసూయ.!

తెలుగు బుల్లితెర దగ్గర కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో మంచి ఆఫర్స్ అందుకుంటున్న వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. అయితే అనసూయ నటిగా ఎంతగానో అలరిస్తుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె అత్యుత్సాహం ఒకింత ఎక్కువగా అనిపించక మానదు.

ఇప్పటికే చాలా సార్లు ట్విట్టర్ వేదికగా ఏవేవో గొడవలు నెటిజన్స్ తో పడుతూ హంగామా చేసింది. సరే ఇదంతా అయిపోయింది మళ్ళీ ఏది లేదు అనుకుంటే ఇప్పుడు తానే సొంతంగా ఓ పోస్ట్ పెట్టి మళ్ళీ కాంట్రవర్సీ చేసే పని చేసింది.

ఎందుకురా నేనేంటే అంత పిచ్చి ప్రేమ నేనేమన్నా అంటే అది మీకు అంత ముఖ్యమా? మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అవుతారు కొంతమంది పిచ్చి క్యూటీస్ అంటూ మళ్ళీ నెటిజన్స్ ని ట్రిగ్గర్ చేసే పని చేసింది. పోనీ ఎవరైనా ఏదన్నా అన్నారు దానికి రిప్లై ఇచ్చింది అనుకుంటే అదీ లేదు.

ఇది డైరెక్ట్ పోస్ట్ గానే పెట్టింది. దీనితో అయితే ఇది మాత్రం ఆమె కావాలనే చేసుకుంటున్నట్టు అనిపించదా? ప్రస్తుతం సినిమాల్లో అయితే కనిపిస్తుంది కానీ టీవీ షోస్ లో అయితే దూరం అయ్యిపోయింది. రీసెంట్ గా మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రంలో ఈమె కీలక పాత్ర పోషించింది.