వెండితెరపై సినిమాల సక్సెస్ రేటు తగ్గినా, ఆన్ లైన్ లో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. 2016 లో హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసిన ‘సరైనోడు’ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 200 మిల్లియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో నటించని బన్నీకి ఇది పెద్ద ఘనతే అని చెప్పాలి. అంతేకాదు జాతీయపరంగా 669,000 లైక్స్ తో ఎక్కువ లైక్స్ కూడా దక్కించుకుంది ‘సరైనోడు’ సినిమా.
దీనిపై ఆలు అర్జున్ స్పందిస్తూ ‘తెలుగు సినిమాలు ఇలా ముందుకు సాగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మన సినిమాలు ప్రాంతీయ హద్దులు దాటి ప్రశంసలు అందుకుంటున్నాయి. మా సినిమా టీం అంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
త్వరలో దువ్వాడ జగన్నాధం సినిమా కూడా 175 మిలియన్ల వ్యూస్ కి చేరువ కానుంది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు పర్లేదు అనిపించాయి. కానీ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా’ మొత్తానికే ప్లాప్ టాక్ అందుకుంది. ఒకవేళ అది కూడా యూట్యూబ్ లో ఇలానే దూసుకుపోతే అల్లు అర్జున్ యూట్యూబ్ స్టార్ ఐపోతాడేమో కదా!!