(ధ్యాన్)
సాధారణంగా ఇండస్ట్రీలో వారసత్వం తాకిడి ఎక్కువగానే ఉంది. అయితే హీరోయిన్స్ విషయంలో ఈ వారసత్వం అనే మాట తక్కువగానే ఉంది. అయితే హీరోయిన్ ఫ్యామిలీకి చెందినవాళ్లు ఇండస్ట్రీలోకి రావడం అనేది కామన్‌గా తక్కువగానే జరుగుతుంటుంది.
ఇప్పుడు ఓ హీరోయిన్ చెల్లెలు(కజిన్) ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు…అను ఇమ్మాన్యుయేల్. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోయేది అను కజిన్. ఇంతకు హీరో ఎవరో తెలుసా? నాని.
ప్రస్తుతం నాని, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో 1980-96 బ్యాక్‌డ్రాప్‌లో జెర్సీ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ సహా పలు పేర్లు వినిపించినా…తాజా సమాచారం ప్రకారం అను ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బా మోనిక జాన్ హీరోయిన్‌గా నటించబోతున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం రానుంది. ఈ చిత్రంలో నాని క్రికెటర్‌గా కనిపించబోతున్నారు.