వైరల్ : పాపం అనసూయకి చురుక్కుమనిపించే కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ.!

గత కొన్ని రోజులు నుంచి కూడా తెలుగు స్మాల్ స్క్రీన్ గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తనని ఎవరూ ఆంటీ అనడానికి వీళ్లేదని ఆంటీ అన్న వాలారు అందరిపై కేసు వేస్తానని కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినా ఇది మాత్రం కాస్త కామెడీ కంటెంట్ గా మారిపోయింది.

దీనితో అయితే అనసూయ పోరాటం కాస్త ట్రోల్ మెటీరియల్ గా అయ్యింది. అయితే ఆమె ఈ విషయంలో సీరియస్ గానే ఉండగా టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ మాత్రం పుండు మీద కరం జల్లే లా చేశారు. తాను సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా చాలా ఫన్నీ గా ఉంటారు.

మరి అలా తన లేటెస్ట్ పోస్ట్ ఒకటి పెట్టగ నెటిజన్ తనని అంకుల్ అన్నాడు. దీనితో దానికి ముందు బ్రహ్మాజీ సీరియస్ అయ్యినట్టుగా అంకుల్ ఏంట్రా అంకుల్ కేస్ వేస్తా ఏజ్ బాడీ షేమింగ్ చేస్తున్నావా అంటూ సరిగ్గా అనసూయ మేటర్ లోనే కౌంటర్ అన్నట్టుగా రిప్లై ఇచ్చారు.

దీనితో ఈ క్రేజీ రిప్లై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అలాగే ఇంకో పక్క అనసూయని కొందరు ట్యాగ్ చేసి మరీ ఇలా ఉండాలని సూచిస్తున్నారు. దీనితో అనసూయ విషయం మళ్ళీ ఇలా అయ్యిపోయింది.