ఇన్సైడ్ టాక్ : పవన్ బర్త్ డే కి ఈ సినిమా నుంచి ఊహించని గిఫ్ట్ రాబోతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని రోజులు పాటు అలా వినిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆల్రెడీ హంగామా స్టార్ట్ చేయగా పవన్ సినిమాలు నుంచి కూడా పలు అప్డేట్స్ ఆ రోజు రాబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడు మరో ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే పవన్ కలుఆన్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఇప్పుడు నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” నుంచి పవన్ ఫ్యాన్స్ కి ఒక మాస్ అప్డేట్ వస్తున్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే సినిమా షూటింగ్ ఇంకా సగం బాలన్స్ ఉండగా ఇప్పటివరకు పవన్ పై అయ్యిన షూటింగ్ లో ఒక ఏక్షన్ పార్ట్ వరకు మాత్రం ఒక సూపర్ టీజర్ లేదా గ్లింప్స్ లాంటి దాన్ని తయారు చేసి రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఈ భారీ సినిమా నుంచి బిగ్ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాని అయితే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా భారీ బడ్జెట్ తో ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.