30న కార్తికేయ ,పూజా ప్రసాద్ వివాహం

రాజమౌళి కుమారుడు కార్తికేయ , రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్ వివాహం 30న  రాజస్థాన్లోని జోద్ పూర్ ఈ నెల 30 జరుగుతుంది . రాజమౌళి  , శ్రీమతి రమ  కుమారుడు కార్తికేయ , నిర్మాత దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ పెద్ద కుమారుడు రామ్ ప్రసాద్ , శ్రీమతి శోభా ప్రసాద్ రెండవ కుమార్తె పూజా ప్రసాద్  . వీరి నిశ్చితార్ధం  అతి మాములుగా జరిగింది .

అలాగే వివాహం కూడా సింపుల్ గా జరిపించాలని రామ ప్రసాద్  అభిప్రాయం . రాజమౌళి కూడా ఇందుకు అంగీకరించాడు . అందుకే జోద్ పూర్లోని ఓ హోటల్ లో ఈ వివాహం జరుగుతుంది . ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిసింది .

ఈ వివాహానికి అతి ముఖ్యులైన వారిని మాత్రమే ఆహ్వానిస్తున్నారట . 150 నుంచి 200 మంది వరకు వుండొచ్చట . ఈ విహాహాన్ని రామ్ ప్రసాద్ జరిపిస్తున్నారు .

జనవరి 5న హైదరాబాద్ నానక్ రామ్ గూడలో వున్న రామా  నాయుడు  స్టూడియోస్ లో రాజమౌళి వివాహ విందును ఏర్పాటు చేస్తున్నారు . రామ్  ప్రసాద్ కూడా ఒక సినిమాకు నిర్మాత . నాగార్జునతో కలసి  కృష్ణ వంశీ దర్శకత్వంలో “చంద్ర లేఖ ‘సినిమాను ఆయన నిర్మించాడు .