హీరో గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం

యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా ‘చాణక్య’ అనే చిత్రాన్ని ముగించి మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా నిన్ననే లాంఛనంగా హైదరాబాద్లో ప్రారంభం అయింది. పెద్ద చిత్రాల నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమిళ దర్శకుడు బిను సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.