Nikhil Siddharth : పాన్ ఇండియా సినిమాతో నిఖిల్…! పోస్టర్ తో ఆకట్టుకున్న నిఖిల్..!

Nikhil Siddharth : తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో పరిచయమైనా నిఖిల్ సిద్ధార్థ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ తో ముందుకెళ్తున్నాడు.ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేకపోయినా వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు నిఖిల్.సినిమా ఎలా ఉన్నా కథ సెలక్షన్లో మాత్రం ఎప్పుడు నిఖిల్ నిరాశపరచడని అభిమానులు నమ్మకం. తాజాగా నిఖిల్ నుండి కొత్త సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.గూడఛారి, ఎవరు, హిట్‌ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి. హెచ్‌ దర్శకత్వంలో నిఖిల్‌ ఓ పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

నిఖిల్ 19వ సినిమాగా ఈ సినిమా వస్తోంది.ఈ సినిమాలో నిఖిల్ గూఢచారి గా కనిపించనున్నాడు.ప్రాజెక్ట్ పేరును, నిఖిల్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక స్పై అనే పేరు సినిమాకు ఖరారు చేసారు. సినిమాలో గూఢచారిగా నిఖిల్ కనిపించనున్నారు. కళ్లజోడు పెట్టుకుని ఒక చేతిలో తుపాకీతో ఇంట్రెస్టింగ్ లుక్ లో ఉన్నాడు నిఖిల్.ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.