Rajamouli : మహేష్, రాజమౌళి సినిమా అలా ఉండబోతుందట… ఇంతవరకు తెలుగులో అలాంటి సినిమా లేదట…!

Rajamouli : రాజమౌళి , మహేష్ కాంబినేషన్ సినిమా అనగానే అటు మహేష్ ప్రేక్షకులు ఇటు కామన్ ప్రేక్షకులు లో కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై రాజమౌళి గారూ స్వయంగా ఇంటర్వ్యూ ల్లో చెప్పారు. ఇదొక సాహస వీరుడి కథగా వస్తోందని ఇప్పటికే రెండు కథలు మహేష్ కు చెప్పగా రెండు నచ్చాయని చెప్పారని అందులో ఏదీ సినిమాగా తీసిన ఓకే అన్నారని రాజమౌళి చెప్పారు.

ఇక ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఈ సినిమా గురించి వినిపిస్తోంది . ఈ సినిమాని ఆయన గత రెండు సినిమాలు లాగ కాకుండా తక్కువ బడ్జెట్ తో పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడని వినిపిస్తోంది.రాజమౌళి సినిమా అనగానే మనకి అద్భుతమైన విఎఫ్ఎక్స్ షాట్స్ తో గొప్పగా తీసే సినిమాలే గుర్తుకు వస్తాయి కానీ మహేష్ తో సినిమా అలాకాకుండా ఛత్రపతి, సింహాద్రి లాంటి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలుగా తీయాలనీ భావిస్తున్నారట.

మహేష్ తో తియ్యబోయ్యే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని కనివిని ఎరుగని రేంజ్ లో ఊహించని ట్విస్టులతో సినిమాని మొత్తం నింపేయబోతున్నాడు అట రాజమౌళి. మరి ఇండస్ట్రీ మొత్తం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ఎలాంటి వండర్స్ ని సృష్టించబోతుందో చూడాలి. ఇక మహేష్ ప్రస్తుతం పరశురాం సినిమా సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇక త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీని తర్వాత మహేష్ తో సినిమా ఉండబోతోంది.