ప‌వ‌న్ సినిమా ఫ్లాప్ అని చెప్పేశాడు!

ప‌వ‌న్ సినిమా ఫ్లాప్ అని చెప్పేశాడు!

ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అంటే బండ్ల గ‌ణేష్‌కు పిచ్చి అభిమానం.. ఎంత అభిమానం అంటే అత‌నంటే ప‌డిచ‌చ్చేంత‌. `గ‌బ్బ‌ర్‌సింగ్‌‌` ఆడియో రిలీజ్ వేడుక‌లో ప‌వ‌న్ గురించి బండ్ల గ‌ణేష్ మాట్లాడిన మాట‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. ఆ అభిమానంతో ప‌వ‌న్‌తో బండ్ల సినిమాలు కూడా నిర్మించాడు. ప‌వ‌న్‌తో బండ్ల గ‌ణేష్ నిర్మించిన చిత్రం `తీన్‌మార్‌` ఈ రోజు(ఏప్రిల్ 14)తో 9 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా సినిమాపై, త‌న అభిమాన న‌టుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై బండ్ల గ‌ణేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తీన్‌మార్ సినిమా త‌న జీవితంలో మ‌ర్చిపోలేని చిత్ర‌మని, సినిమా ఆశించిన విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయినా ఈ మూవీ జ‌ర్నీ ఓ అద్భుత‌మైన అనుభూతిని మిగిల్చింద‌న్నాడు.

అమెరికా, థాయ్‌ల్యాండ్‌, కాశీ, ద‌క్షిణాఫ్రికా, మైసూర్‌ల‌లో షూటింగ్ చేశామ‌ని. ఇందులో త్రివిక్ర‌మ్ రాసిన హృద‌యానికి హ‌త్తుకునే డైలాగ్‌లు ఎన్నో వున్నాయ‌ని, అర్జున్ పాల్వాయ్‌గా, మైఖేల్ వేలాయుధంగా బాస్ న‌ట‌న సూప‌ర్ అని ప్ర‌శంసల్లో ముంచెత్తాడు. బండ్ల గ‌ణేష్ చేసిన ట్వీట్స్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి.