‘సంకల్ప యాత్ర’ దేవుడు నా కోరిక తీర్చినందుకు మొక్కు తీర్చుకోవడానికి చేస్తున్న పాదయాత్ర: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌

Bandla Ganesh: ”సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర’అన్నారు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌. షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు ‘సంకల్ప యాత్ర’ ప్రారంభించారు బండ్ల గణేశ్‌.

ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు ఆయన రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర. ఇది రాజకీయ యాత్ర కాదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నా షాద్ నగర్ ప్రజలు, నాకు ఈ స్థాయి ఇచ్చి, నా జీవితానికి అర్థం చెప్పి, నేనున్నానని ముందుకు నడిపించిన దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను అడుగు ముందుకు వేస్తున్నాను. చిరంజీవి గారిని చూడాలని హైదరాబాద్ కు వెళ్లాను. ఈరోజు ఆయన నటించిన సినిమా నా ధియేటర్లో ఆడుతుంది. నేను పాదయాత్ర మొదలు పెడుతున్నాను ఇది భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నాను.

నాకు ఉదయం 4 గంటలకే నిద్ర లేచే అలవాటుంది. ఆ రోజు టీవీలో చంద్రబాబు అరెస్ట్‌ వార్త చూడగానే షాక్‌కి గురయ్యాను. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడమేంటని ఆశ్చర్యపోయాను. గుంటూరుకు తీసుకొచ్చి బెయిల్‌ ఇస్తారనుకున్నాను. రాజమండ్రి జైలుకు పంపించారు. రోజులు గడిచేకొద్దీ నాకు టెన్షన్‌ మొదలైంది. జైల్లో చంద్రబాబు గారికి ఏమన్నా అవుతుందా అనే భయమేసింది. ప్రతిక్షణం ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూశాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా నేను సుప్రీంకోర్టుకు వెళ్లాను. చంద్రబాబుకు బెయిల్‌ వచ్చిందనే వార్త మొదట వినడానికే దిల్లీ వెళ్లి కూర్చునేవాడిని. జైలు నుంచి ఆయన తిరిగివస్తే నా గడప నుంచి వెంకన్న గడపకు పాదయాత్రగా వస్తానని ఏడుకొండలవాడిని మొక్కుకున్నా.

దేవుడి ఆశీస్సులతో 52 రోజుల తర్వాత మహానేత చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాడి గర్వం లాగా తెలుగు వాడి తేజస్సు లాగా బయటకు వస్తుంటే ఆయన్ని చూసిన ఉత్సాహం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన లాంటి వ్యక్తి తెలుగు జాతికి కావాలని మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకోడానికి ఈరోజు పాదయాత్ర చేస్తున్నాను. ఈ యాత్రను రాజకీయంగా చూడొద్దు. విమర్శలు చేయొద్దు. నేను వేసే ప్రతి అడుగు చంద్రబాబు ప్రతి అభిమాని అడుగు. జై చంద్రబాబు.. ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి, నా షాద్ నగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు అభిమానం ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. బండ్ల గణేష్ గారు చేస్తున్న ఈ సంకల్పయాత్ర చాలా గొప్పది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కోట్ల మంది సంఘీభావాన్ని ప్రకటించారు. ఈరోజు బండ్ల గణేష్ గారు చేస్తున్న సంకల్ప యాత్రకి ఎంతోమంది తెలుగు ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నారు. స్వామి ఆశీస్సులతో ముందుకు నడుస్తుంది. చివరి రోజు వారితో పాటు స్వామివారి దర్శనం మేమందరం చేయాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది

ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. బండ్ల గణేష్ గారు తలపెట్టిన ఈ సంకల్ప యాత్ర విజయం సాధించాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్ అందరి మేలుకోరేవాడు. వెంకన్న ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆయన సంకల్పం దిగ్విజంగా పూర్తి కావాలని, అందరిని మంచిగా చూసుకోవాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఈ సంకల్ప యాత్రకు సహకరించాలని కోరుతున్నాను.

నటుడు శివాజీ మాట్లాడుతూ .. బండ్ల గణేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయనతో నాకున్న పరిచయం 30 ఏళ్ల పై మాటే. సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన నాకు పేజర్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంతో కృషి ఉంది. ఎంతో మందికి ఆయన సహాయం చేశారు. చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఆ పరిస్థితులో ఉన్నప్పుడు బయటకు రావాలని ప్రజలందరూ కోరుకున్నారు గణేష్ అన్న ఆరోజు తన మొక్కుకున్న ముక్కు ప్రకారం షాద్నగర్ నుంచి వెంకన్న సన్నిధికి ఈ పాదయాత్ర ని ప్రారంభిస్తున్నారు. ఇది ఒక మహా సముద్రం లాగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆశీస్సులు గణేష్ అన్నకి ఉంటాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వామి సన్నిధికి ప్రయాణిస్తారు. స్వామివారి దర్శనం రోజున నన్ను కూడా భగవంతుడు అక్కడికి తీసుకురావాలని కోరుకుంటున్నాను

యష్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, బండ్ల గణేష్ గారు శివాజీ గారు ఎంతోమంది అండగా నిలబడ్డారు. ఆనాడు మేమందరం కలిసి పని చేశాం. గణేష్ అన్న ఏ స్వార్ధం లేకుండా ఈ యాత్రను చేపడుతున్నారు .ఈ పాదయాత్రలో మేము కూడా ఆయనతోపాటు కలిసి ప్రయాణిస్తాం.

రాధాకృష్ణ || Analyst Ks Prasad About Bhatti Vikramarka FIRES on ABN Radhakrishna Over False News |TR