ప‌వ‌న్ రీ ఎంట్రీకి అంత రెమ్యూన‌రేష‌నా?

సినిమాల్లో ఒక రకమైన ట్రెండ్ ని సృష్టించి, ఆ తరువాత ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరితో మమేకమవుతూ, ప్రజాసమస్యలకై నిత్యం పోరాటం చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి… అయితే హిందీలో సూపర్ హిట్ అయినటువంటి పింక్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించనున్నారని, ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తాడని పుకార్లు బాగా వస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్నారని సమాచారం.

 

ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో బాగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి ఎలాగోలాగు దిల్ రాజు, పింక్ రీమేక్ కోసమని పవన్ కళ్యాణ్ ని ఒప్పించారు. అయితే ఈ చిత్రానికి గాను దిల్ రాజు, పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల పారితోషికాన్ని ఇవ్వనున్నట్టు సమాచారం. దానికి తోడు మరొక 20 కోట్ల రూపాయలు పెట్టి, ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకున్నట్లు సమాచారం. అంటే ఈ చిత్రానికి గాను దిల్ రాజు మొత్తం 70 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాడని తెలుస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబందించిన వివరాలు అన్ని కూడా అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

 

అయితే లేటుగా వ‌చ్చినా లేటెస్ట్ గా వ‌స్తాడు అన్న‌ట్లుగా ఒక‌టేసారి అంత పారితోష‌కం అందుకోవ‌డం అంటే మాములు విష‌యం కాద‌నే చెప్పాలి. డిసెంబర్ 12 పింగ్ రీమేక్ మూవీ ఎస్వీసీ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. పింక్ రీమేక్‌తో పవన్ కళ్యాణ్ మూవీకి తొలిసారి సంగీతం అందించబోతున్నారు తమన్. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన ‘పింక్‌’ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అనిరుద్ధ రాయ్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ, కృతీ కల్హరీ, ఆండ్రియా టారియంగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత బోనీకపూర్‌ ‘పింక్‌’ చిత్రాన్ని గత ఏడాది తమిళంలో ‘నేర్కొండ పార్వై’గా రీమేక్‌ చేశారు.