బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర లాభాల్లో యాభైశాతం కేవలం రైటింగ్ స్కిల్స్‌కి ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఇచ్చిన ఆఫర్ అదే.
బేసిక్‌గా తెలుగు ఇండస్ట్రీలో దిల్‌రాజు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా కఠినంగా వ్యవహరిస్తారు. ఇక ఈ విషయంలో కూడా ఆయన తెలివిగా వ్యవహరించారనే చెప్పాలి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు దగ్గరవ్వడానికి ఆయన వేసిన గాలం అని కొందరు భావిస్తున్నారు. ఆ మేరకు త్రివిక్రమ్ కు ఆ ఆఫర్ ఇచ్చి వుండాలి.
అయితే అవసరం తీరాక ఒక మాట తీరకముందు ఒకమాట అన్నట్లు సినిమా సెట్ అయిన తరువాత మెల్లగా త్రివిక్రమ్ ను ఆయన అంతట ఆయన దూరం అయ్యేలా చేసారు. దిల్ రాజు వైఖరితో ఇగో హర్ట్ అయిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు దూరం అయ్యారు. దాంతో ఇక ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ అన్న ఊసే లేదు.
దర్శకుడిగా వున్న వేణు శ్రీరామ్ స్క్రిప్ట్ పని కూడా ఆయనే చూసుుకుంటారు. దీనికి అదనపు ఖర్చు కూడాలేదు. అందువల్ల దిల్ రాజు ఎత్తుగడ బాగానే ఫలించినట్లు అనుకోవాలి. ఎటొచ్చీ పవన్ దగ్గర బ్రేక్ పడకుండా వుంటే. సినిమా పట్టాలెక్కినట్లే. మొత్తానికి దిల్‌రాజు ఎత్తుగడ బాగానే పని చేసింది.