అఖిల్‌కి హిట్ పడటం ఖాయమేనా?

అఖిల్‌తో పూజా హెగ్డే జోడీయే ఓ హాట్ టాపిక్. ఆ సినిమా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తుండటం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రంలో రొమాన్స్ పీక్స్‌లో ఉంటుందన్న టాక్ మరింత పెద్ద టాపిక్ అవుతోంది. సినిమా చిత్రీకరణ చాలావరకు పూరె్తైంది. అఖిల్, పూజాహెగ్డే లవ్‌ట్రాక్‌లో నాలుగు కీలక సన్నివేశాలు కుర్రకారుని ఎక్కడికో తీసుకెళ్తాయట. ఈ రొమాంటిక్ సీను సినిమాకు హైలెట్ అని టాక్ వినిపిస్తోంది. సీన్స్ బాగా వచ్చాయన్న సంతోషంలో ఉంది చిత్ర యూనిట్. రొమాన్స్‌ని దర్శకుడు హార్ట్ఫుల్‌గా చిత్రీకరించాడని, యూత్‌కి సీన్స్ బలంగా కనెక్టవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక దేవిశ్రీ పాటలు కూడా సినిమాకి ప్రాణంగా నిలుస్తాయన్న మాట వినిపిస్తోంది. ఈ సినిమాతో అఖిల్‌కి హిట్ పడటం ఖాయమన్న మాటే వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు తరువాత ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌తో కలిసి అఖిల్ సెట్స్‌పైకి వెళ్లనున్నాడు.