Akhil Akkineni: ఘనంగా అఖిల్ అక్కినేని పెళ్లి వేడుకలు.. నెట్టింట ఫోటోస్ వైరల్!

Akhil Akkineni: తెలుగు ప్రేక్షకులు అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. అక్కినేని వారి వెంట పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. అఖిల్ పెళ్లి కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఏదో చూస్తున్నారు. నాగార్జున చిన్న కుమారుడు అయిన అఖిల్ అక్కినేని వివాహ బంధం లోకి తాజాగా అడుగు పెట్టారు. బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెబుతూ జైనాబ్ కలిసి ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం జూన్‌ 6న ఉదయం మూడు గంటలకు వీరి వివాహం జరిగింది.

ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్, సహా తదితరులు హజరైనట్లు తెలుస్తోంది. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ వేడుక జరగనుంది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇకపోతే హీరో అఖిల్ అక్కినేని విషయానికి వస్తే.. అఖిల్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న కూడా అఖిల్ కెరియర్ లో ఇప్పటి వరకు సరైన సక్సెస్ సినిమా ఒక్కటి కూడా పడలేదు. సరైన సక్సెస్ సినిమా కోసం అఖిల్ కూడా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. అఖిల్ ప్రస్తుతం ఒక రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి పెళ్లి తర్వాత అయినా అఖిల్ కు కెరియర్ పరంగా కలిసి వస్తుంది ఏమో చూడాలి మరి.