అక్కినేని అఖిల్ నాలుగో సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది కానీ ఇంత వరకు అఖిల్ కు జోడీ దొరకలేదు. అది వరకు కియారా అద్వానీ ని సంప్రదించినా ఆమె డేట్లు దొరకలేదు.
కొత్త హీరోయిన్ పెట్టుకుందామంటే ఇప్పటి దాకా అఖిల్ కి కొత్త హీరోయిన్లు కలిసి రాలేదు. అందువల్ల కొంత ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే సినిమాకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో పూజా హెగ్డేని సంప్రదించారట. అయితే ఆమె ఇంకా సినిమాకి సంతకం చేయలేదు. కారణం ఆమె రెమ్యూనరేషన్.
ఆమె సినిమాకి కోటి నుంచి కోటి యాభై వరకు తీసుకుంటుంది. అంత మొత్తం ముట్ట చెపితేనే సినిమా ఒప్పుకుంటుంది. మరి దర్శకనిర్మాతలు ఏం నిర్ణయించుకుంటారో వేచి చూద్దాం. ఈ సినిమా కూడా అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మరో ప్రేమ కధా చిత్రం. గీత ఆర్ట్స్ పతాకం పై ఈ సినిమా నిర్మించబడుతుంది.