ఐరెన్ లెగ్‌లు కూడా గోల్డెన్ లెగ్‌లవుతున్నాయి!?

అబ్బా.. టాలీవుడ్ లో ఇప్పుడు ఎవ్వరినోటా  విన్నా ఇదే మాట!  కాలం కలిసొస్తే.. ఐరెన్ లెగ్‌లు కూడా గోల్డెన్ లెగ్‌లవుతున్నాయి అని పదే పదే గంటాపథంగా చెప్పుకుంటున్నారు.  ప్రస్తుతం పూజా హెగ్డే  గోల్డెన్ లెగ్‌తోనే కెరీర్‌ని నడిపిస్తోంది.
 
ఒకప్పుడు వరుస ఫ్లాపులతో చేతిలో సినిమాలే లేని పరిస్థితి ఎదుర్కొన్న పూజ.. ఇప్పుడు ఏ ప్రాజెక్టును ఒప్పుకోవాలా? అన్నత బిజీ అయిపోతోంది. తెలుగులోని స్టార్ హీరోలంతా ‘పూజ’ పేరు జపిస్తుంటే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన పూజ మొత్తానికి అక్కడ భారీ అవకాశాన్నే అందుకుంది.
 
బాలీవుడ్‌లో పూజ చేసిన ‘మొహంజొదారో’ డిజాస్టర్ కావడంతో అవకాశాలు తెరమరుగయ్యాయి. చాలా గ్యాప్ తరువాత ‘హౌస్‌ఫుల్ -4’లో అవకాశం అందుకుంది. ఆ సినిమాకు ఓకే  అనిపించుకోవడంతో  పూజ ఊపిరి పీల్చుకుంది. ఈలోగా తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు పడుతుండటంపై టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది పూజ. ఇప్పుడు వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు పడుతున్న టైంలో బాలీవుడ్‌లో ఏకంగా సల్మాన్‌కు జోడీగా చాన్స్ వచ్చిందట.
 
సల్మాన్‌తో సాజిద్  నడియావాలా నిర్మించనున్న ‘కబీ  ఈద్ కబీ  దివాలీ’లో పూజకు గోల్డెన్ చాన్స్ తగిలింది. సల్మాన్‌తో పూజ కాంబినేషన్ ఇదే ఫస్ట్‌టైం. ఫర్హాద్ సంజీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా 2021 ఈద్ కు విడుదలవుతుందని సమాచారం!? వాహ్.. ఈ విధంగా పూజా హెగ్డే  గోల్డెన్ లెగ్‌తోనే కెరీర్‌ని నడిపిస్తోందన్న మాట!? అల్ ది బెస్ట్ పూజ!!