మరో వివాదంలో టిఆర్ఎస్ మంత్రి జూపల్లి (వీడియో)

మంత్రి జూపల్లి కృష్ణారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. జూపల్లి సభల కోసం పెట్టిన డబ్బును తిరిగివ్వటం లేదని మనస్తాపం చెంది బాల్ రెడ్డి అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. పూర్తి వివరాలేంటంటే..

చిన్నం బావి మండలం పెద్దమారూరుకు చెందిన టిఆర్ ఎస్ కార్యకర్త బాల్ రెడ్డి ఉప ఎన్నికల సమయంలో పార్టీ సభ కోసం రూ. 15 వేలు ఖర్చు చేయగా  డబ్బు ఇస్తామని మాట దాట వేశారన్నారు. అప్పుడు కొల్లాపూర్ టిఆర్ ఎస్ అభ్యర్దిగా జూపల్లి కృష్ణారావు బరిలో ఉన్నారు.

సభలకు జనాలను తరలించటానికి కూతురు యొక్క బంగారు నగలు తాకట్టు పెట్టి ఖర్చు చేశానన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన కుటుంబంలో గొడవలవుతున్నాయని ఆవేదన చెందాడు. దీనికి కారణం జూపల్లి కాబట్టి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడట్టు బాల్ రెడ్డి తెలిపారు. బాల్ రెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.    

 

BAL REDDY