రేవంత్ అన్నను చూపిస్తరా లేదా ? వార్నింగ్ (వీడియో)

36 గంటలుగా రేవంత్ రెడ్డి నివాసంలో ఐటి అధికారులు సోదాల పేరుతో హంగామా చేస్తున్నారు. 16 మంది ఐటి అధికారులు రేవంత్ రెడ్డి నివాసంలోనేే కాకుండా ఆయన దోస్తుల ఇండ్లలో, అనుచరుల ఇండ్లలోనూ సోదాల పేరుతో షో చేస్తున్నారు. ఇంటి తాళాలు బద్ధలు కొట్టి మరీ సోదాలు చేపట్టారు. 

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఐటి అధికారులు చేస్తున్న దాడులు రాజకీయ రంగు పులుముకున్నాయి. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఇంటి మీద ఐటి దాడులు చేపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇదే విమర్శను తెర మీదకు తెచ్చింది.

ఇక రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం సమయంలో కొడంగల్ నుంచి తన ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఆయనను ఐటి అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ అభిమానులు, కార్యకర్తలకు ఆగ్రహం, ఆక్రోశం, అసహనం కట్టలు తెగింది. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.

శుక్రవారం సాయంత్రం వేళ అవుతున్నా ఇంకా దాడులు కొనసాగించడంతో వారు సీరియస్ అయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాడులు, సోదాలు ఇంకెంత సేపు చేస్తారంటూ ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు రేవంత్ అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంతసేపు సోదించడానికి ఏముందని వారు అసహనం వ్యక్తం చేశారు.

రాజకీయ పరమైన దాడులు చేస్తున్నప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు అని వారు ప్రశ్నించారు. వారి నినాదాలు, అరుపులు, కేకలతో జూబ్లిహిల్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్, బిజెపి కలిసి ఆడుతున్న నాటకంలో ఐటి అధికారులు ఇంత హడావిడి చేయడమేంటని వారు నిలదీశారు. 

ఒక దశలో రేవంత్ రెడ్డి అసలు ఇంట్లోనే ఉన్నాడా? లేదంటే అరెస్టు చేశారా అన్న అనుమానం కలిగింది ఆయన అభిమానులకు. అందుకే రేవంత్ అన్నను చూపించండి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చెట్టు మీద కొంగ అంటూ కేసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రేవంత్ అనుచరుల ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు దిగొచ్చారు. రేవంత్ రెడ్డిని చూపిస్తరా లేదా అని కార్యకర్తలు ఆందోళన నేపథ్యంలో రేవంత్ ను ఒకసారి బయటకు తీసుకొచ్చారు. రేవంత్ వస్తూనే అందరికీ చేయి ఊపుతూ అభివాదం చేశారు. కొద్దిసేపు వారికి చూసే అవకాశం కల్పించి తర్వాత రేవంత్ ను లోపలికి తీసుకుపోయారు. ప్రస్తుతం దాడులు కంటిన్యూ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే దాడులు 36 గంటల పాటు సాగిన తర్వాత రేవంత్ ను అరెస్టు చేస్తారా? లేదా అన్న ఉత్కంఠ మాత్రం వీడలేదు. పోలీసు వర్గాలు, రాజకీయ వర్గాల్లో మాత్రం రేవంత్ ను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఎన్నికల వేళ రేవంత్ ను అరెస్టు చేసినా, చేయకపోయినా రేవంత్ ను మరోసారి రాజకీయ తెర మీదకు టిఆర్ఎస్ బలంగా తీసుకొచ్చింది అన్న చర్చ కూడా ఉంది.

రేవంత్ అనుచరుల నినాదాల హోరు వీడియో కింద ఉంది చూడండి.

 

revanth reddy home

 

రేవంత్ సతీమణి గీత ను బ్యాంకుల చుట్టూ తిప్పిన ఐటి అధికారుల వార్త కింద ఉంది చదవండి.
https://telugurajyam.com/it-raids-still-continues-in-revanth-house/