రేవంత్ రెడ్డి మరదలు వాణి ఆచూకీ తెలియక టెన్షన్

రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి ఐటి రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యుల ఇండ్ల మీద బంధువుల ఇండ్ల మీద, సన్నిహితుల ఇండ్ల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఒక విషయం రేవంత్ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆ వివరాలు చదవండి.

రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఇండ్లలోనూ ఇవాళ ఐటి దాడులు జరిగాయి. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి మరదలు వాణి ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నారు రేవంత్ కుటుంబసభ్యులు.

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, ఆయన సతీమణి వాణి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ రాత్రి ఎనిమిదిన్నర అవుతున్నా ఇంతవరకు ఆచూకీ లేదని కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు అరెస్ట్ చేసారా, విచారిస్తున్నారా, ఎక్కడ ఉంచారు? అనే విషయంలో ఏ రకమైన  సమాచారాన్ని పోలీసులు ఇవ్వడంలేదని వారు చెబుతున్నారు. ఈ విషయంలో తక్షణమే పోలీసులు స్పష్టమైన విషయాలు వెల్లడించాలని వారు కోరుతున్నారు.

కొద్దిసేపటి క్రితమే కొడంగల్ నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయనకు ఐటి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతం రేవంత్ ఇంట్లో ఇంకా కూడా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రేవంత్ తన నివాసంలోనే ఉన్నారు. మహిళల విషయంలో ఇలా చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.