కేటిఆర్ కి షాకింగ్ ప్రశ్న వేసిన కాంగ్రెస్ భట్టి విక్రమార్క

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కలిశారు. డిప్యూటి స్పీకర్ ను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు. దాదాపు గంట పాటు వారు చర్చించుకున్నారు. ఇ దే సమయంలో భట్టి కేటిఆర్ కు వేసిన ప్రశ్నకు కేటిఆర్ సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. తెలంగాణలోని ఎమ్మెల్సీల ఎన్నికకు 5గురిని ఎందుకు బరిలోకి దించారు. మీకున్న  సభ్యుల ప్రకారం నలుగురే బరిలో ఉండాలి కదా అని  ప్రశ్నించారు. మాకు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ తమదే కదా మీరు ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నారని భట్టి కేటిఆర్ ని  ప్రశ్నించారని సమాచారం. దీంతో కేటిఆర్ నవ్వి సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది. ఒకటి అడుగుదామని వస్తే ఇంకొకటి అడగడంతో కేటిఆర్ షాకయ్యారు.

ఇదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడకు చేరుకోవడంతో కేటిఆర్ ఆయనతో కూడా మాట్లాడారు. కేటిఆర్ నా నంబర్ ను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టావని ఉత్తమ్ అడిగారు. దీంతో కేటిఆర్… మీ నంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టగలనా. నేను కేవలం మెసేజ్ లు మాత్రమే చూస్తానని ఉత్తమ్ కు సమాధానమిచ్చారు. మాకు ఒక దానికి సహకరించాలని కేటిఆర్ వస్తే భట్టి మరోక దాని పై ప్రశ్నించడంతో కేటిఆర్ ముఖంలో కల తప్పిందని అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నారు.