మాజీ మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంటలోని ప్రభుత్వ హస్టళ్లను సంర్శించారు. హాస్టళ్లలో కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంటలో మరో మూడు హాస్టళ్లు అవసరం ఉందని వాటిని త్వరలోనే మంజూరు చేయిస్తామన్నారు. ఇంటిగ్రేటేడ్ హాస్టళ్లను కట్టిస్తామన్నారు. హాస్టల్ వార్డెన్ లు సరిగా పని చేయకపోతే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలువురు వార్డెన్లు సరిగా పని చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈటల రాజేందర్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.