(అహ్మద్ షరీఫ్*)
సెప్టెంబర్ 26, 2018 గూగుల్ సంస్థ , తమ “గూగుల్ మ్యాప్స్” అప్ లో “గ్రూప్ ప్లానింగ్” అనే నూతన అంశాన్ని జోడించింది. ఏమిటి ఈ గ్రూప్ ప్లానింగ్ ప్రత్యేకత ?
ఓ నలుగురు స్నేహితులు కలిసి ఓ మంచి రెస్టారెంట్ లో బర్త్ డే పార్టి చేసుకో వాలను కున్నారను కుందాం. ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలి? అనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్కోరికి ఒక్కో రకమైన ఇష్టా లుంటాయి. అందరి ఇష్టాలు ఏకీ భవించేట్లు ఒక రెస్టారెంట్ ని సెలెక్ట్ చేయాలి.
అ నలుగురు స్నేహితులు ఓ రూమ్ లో కుర్చుని “అక్రాస్ ది టేబుల్” మాట్లాడుకో గల్గితే ఇదేమంత పెద్ద సమస్య కాదు. ఓ రెస్టారెంట్ ను సెలెక్ట్ చేయడం కోసం ఎక్కడే క్కడో వుండే నలుగురు స్నేహితులు కనీసం పది నిముషాలు ఒక చోట చేరి మఖా ముఖి మాట్లాడుకోవడం ఈ రోజుల్లో సంభవమేనా ?
ఇలా ఓ రెస్టారెంట్ ను సెలెక్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఎవరైనా ఎం చేస్తారు? ఓ కాన్ఫరెన్సు కాల్ చేయవచ్చు. ఇదికూడా అంత సుళువు కాదు. అందరికి ఫ్రీ టైం వుండాలి. అందరి సమయాలు కలవాలి. ఇక రెండో ప్రత్యామ్నాయం మెసేజ్ లు పంపుకోవడం .
ఒక్కొక్కోరికి మెసేజి లు పెట్టటం వారి జవాబులు సేకరించడం, ఎవరి ఇష్టమేమిటో గుర్తుపెట్టుకుంటూ, వారి వారి కన్ఫర్మేషన్ లు తీసుకుంటూ, ఒక్కొక్కోరి మెసేజి కోసం ముందుకి వెనక్కి వెళుతూ వివరాలన్నింటిని ఓ కొలిక్కి తీసుకురావడం – ఇదంతా చాల శ్రమ తో కూడుకున్న ప్రక్రియ.
“గ్రూప్ ప్లానింగ్” ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది నలుగురు స్నేహితులు ఒక చోట చేరి ముఖా ముఖి మాట్లాడుకుని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అత్యంత దగ్గరి ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చు. గ్రూప్ ప్లానింగ్ ద్వారా అందరికి నచ్చే ఒక మంచి రెస్టారెంట్ ను సులభంగా ఎలా సెలెక్ట్ చేసుకో వచ్చో చూద్దాం
- రెస్టారెంట్ ల లిస్టు తయారు చేయడం
గూగుల్ మ్యాప్స్ యాప్ ను ఆక్టివేట్ చేశాక, సెర్చి బార్ లో “రెస్టారెంట్” అనే పదాన్ని ఇస్తే, చుట్టుపట్ల వున్న రెస్టారెంట్ లన్ని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి .
ఎ.
వాటిలో ఒక్కో రెస్టారెంట్ ను పరిశీలించి మనకు నచ్చిన రెస్టారెంట్ ఫోటో మీద వత్తిపట్టడం ద్వారా దాన్ని ఒక లిస్టు లో చేర్చ వచ్చు . లిస్టు స్క్రీన్ కిందిభాగం లో ఎడమవైపు ఒక బుడగలా కనిపిస్తున్నది, ఈ లిస్టు లో రెండు రెస్టారెంట్ లను చేర్చిన ట్లు గమనించ వచ్చు
- లిస్టు ను మిత్రులకి షేర్ చేయడం
ఇలా తయారైన లిస్టు ను షేర్ బటన్ నొక్కి, “వాట్స్ ఆప్”, లేదా “ఇమెయిల్” లేదా, “ఎస్ ఎం ఎస్” లేదా మరేదయినా “టెక్స్ట్” ల ద్వారా మిత్రులకు పంపించ వచ్చు .
మిత్రులకు షేర్ చేసినపుడు ఈ క్రింది విధంగా మెసేజ్ వెళుతుంది
- వోటింగ్ ద్వారా ఇష్టాలు అయిష్టాలు తెలపడం
ఎవరైతే ఈ మెసేజ్ ను పొందుతారో వారు మెసేజ్ లో వున్న లింక్ ద్వారా క్రింద చూపిన విధంగా రెస్టారెంట్ ల లిస్టు ను పొందవచ్చు. ఈ స్క్రీన్ లో పంపిన వారి వివరాలు ఒక్కో రెస్టారెంట్ మీద ఇష్టం ( ) అయిష్టం ( ) తెలపడానికి వీలుగా చిహ్నాలుంటాయి. ఒక్కో రెస్టారెంట్ మీద మన ఇష్టాలు అయిష్టాలు తెలిపిన తరువాత పైన వున్న షేర్ బటన్ నొక్కడం తో ఈ వివరాలు మిగత వారితో పంచుకోవచ్చు. చివరికి ఎవరెవరికి ఏమిష్టమో తెలియజెసే ఒక పూర్తి రెస్టారెంట్ ల లిస్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో వుంటుంది. దీనితో ఆందరికీ నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది.
ఈ నూతన అంశం (ఫీచర్) వల్ల సమయం, శ్రమ ఆదా చేసుకుంటూ సరియైన నిర్ణయం తీసుకోడం సులువవుతుంది. ఒకరికి నచ్చిన రెస్టరాంట్స్ మరొకరికి నచ్చకపోతే, ఆయన తనకు నచ్చిన దానిని యాడ్ చేయవచ్చు. ఇలాలిస్టు అంతిమంగా అందరికి నచ్చిన రెస్టరాంట్ల జాబితా తయారువుతుంది. ఏముంది అపుడు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవడం చాలా ఈజీ.
(*అహ్మద్ షరీఫ్, కవి, రచయిత, Conseco Data Services India Ltd మాజీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుతం PMP సర్టిఫకేషన్ కన్సల్టెంట్ గా ఉంటున్నారు)