టీమిండియా ఘన విజయం..టెస్టు సిరీస్‌ భారత్‌ కైవసం

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో నాలుగో టెస్ట్ లో టీమిండియా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్‌ వేసిన 54.5వ బంతికి లారెన్స్‌ (50) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

సిరీస్​ను 3-1తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఫలితంగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్​ మైదానంలో న్యూజిలాండ్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 205 పరుగులు చేయగా.. భారత్​ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్​కే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లో అశ్విన్‌, అక్షర్‌ చెరో 5 వికెట్ల తీసి ఇంగ్లండ్‌ నడ్డి విరిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 3_1 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.