ఇదే జరిగితే… సెమీఫైనల్స్ లో భారత్ – పాక్ ఢీ!

రసవత్తరంగా సాగుతున్న వరల్డ్ కప్ లో ఇక సెమీస్ సమరాలపై చర్చ మొదలైంది. ఎన్నో ట్విస్ట్లు, మరెన్నో జలక్కులతో సాగుతున్న ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఏయే జట్లు తలపడనున్నాయనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయలో ఇప్పటికే సెమీస్ కి చేరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న భారత్ తో ఏ టీం తలబడపోతోంది అనేది మరింత చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయలో ఆఫ్గనిస్తాన్ ని కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు.

అవును… ఈ ప్రపంచకప్‌ లో భారత్‌ ఇప్పటికే సెమీస్‌ చేరగా.. అక్కడ టీం ఇండియా తలబడపోయేది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచే జట్టును ఈ నెల 15న జరిగే తొలి సెమీస్‌ లో రోహిత్‌ సేన ఢీకొడుతుంది. ప్రస్తుతం 16పాయింట్లతో పాయింట్ల పట్టికలో భారత్ టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. తర్వాతి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా నాకౌట్‌ కు అర్హత సాధించింది.

ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ ల మధ్య పోటీ ఉంది. ఇక మిగిలిన నాలుగు జట్లు అయిన ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, శ్రీలంక సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక ఏమి జరిగినా… ఎలాంటి అద్భుతాలు జరిగినా అవకాశం లేదు! ఊహించని రీతిలో ఏదైనా ఓ అద్భుతం జరిగితే ఆఫ్గనిస్తాన్ కి మాత్రం సెమీస్ కి చేరే ఛాన్స్ ఉంది.

ఇక ప్రధానంగా ఇండియా, సౌతాఫ్రికా మినహా మిగిలిన నాలుగుజట్లైన ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ లలో ఏ దేశానికి ఎలాంటి అవకాశాలున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఇందులో ప్రధానంగా… ఆడిన 7 మ్యాచ్‌ ల్లో 5 విజయాలు – 10 పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్‌ కు చేరువలో ఉంది. ఇక మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ లను వరుసగా అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ ల్లో గెలిస్తే అప్పుడు 14 పాయింట్లవుతాయి. అప్పుడు నెట్‌ రన్‌ రేట్‌ ను బట్టి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా రెండింటిలో ఏవి 2, 3 స్థానాల్లో నిలుస్తాయో తెలుస్తుంది.

ఏదో ఒక్క మ్యాచ్ గెలిచినా 12 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగే అవకాశానికి వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు!! ఒకవేళ చివరి రెండు మ్యాచ్‌ ల్లో ఓడిపోతే.. మిగతా జట్ల ఫలితాలపై ఆసీస్ సెమీస్ ఎంట్రీ ఆధారపడి ఉంటుంది. ఇక ఎనిమిది మ్యాచ్‌ ల్లో చెరో నాలుగు విజయాలతో ఉన్న న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ తమ చివరి మ్యాచ్‌ లను వరుసగా శ్రీలంక, ఇంగ్లాండ్‌ లతో ఆడనున్నాయి.

ఈ మ్యాచ్ లలో న్యూజిలాండ్, పాకిస్థాన్ లు గెలిస్తే చెరో 10 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్‌ రన్‌ రేట్‌ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. అయితే అఫ్గాన్‌ ఓడితేనే రన్ రెట్ టాపిక్ తెరపైకి వస్తుంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఓడి, అఫ్గాన్‌ కూడా మిగతా మ్యాచ్‌ ల్లో పరాజయం పాలైతే.. అప్పుడు ఈ మూడు జట్లలో మెరుగైన నెట్‌ రన్‌ రేట్‌ ఉన్న జట్టు నాకౌట్‌ చేరుతుంది. ఇక ఆఫ్గాన్ విషయానికొద్దాం!

ఆఫ్గన్ కు ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. ఇందులో అఫ్గాన్‌.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. వీటిపై గెలిస్తే 12 పాయింట్లతో నేరుగా సెమీస్‌ లో అడుగుపెడుతుంది. ఒక్క మ్యాచ్‌ గెలిచినా మెరుగైన రన్‌ రేట్‌ ఉంటే కివీస్‌, పాక్‌ లను దాటేసి ముందంజ వేయొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే… దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ లలో ఏ దేశంతో భారత్ సెమీస్ ఆడనుందనే విషయంలో స్పష్టత రావాలంటే మరికొన్ని మ్యచ్ లు ఆగాల్సిందే!