బ్రహ్మానందం తెలుగు సినిమా హాస్య నటుడు. బ్రహ్మానందం 1956 గుంటూరులోని ముప్పాళ్ళ గ్రామంలో జన్మించాడు. ఇతను పుట్టగానే తల్లికి గుర్రపు వాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిగా నిలిచాడు. అప్పటికే ఆరుగురికి జన్మనిచ్చిన తల్లి, ఇతను పుట్టిన తర్వాత చనిపోతుంది అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి.
గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా తీసుకొని 9 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసి సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. 1985లో వేజల్ల సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న తాతావతారం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఈ సినిమాలో హీరో నరేష్ కు ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆయన నటించని సినిమాలు వెతకడం చాలా కష్టమేమో అన్నట్టు అందరూ హీరోలు, దర్శక నిర్మాతల సినిమాలలో నటించడం జరిగింది.
ఫిబ్రవరి 1 పుట్టినరోజు సినిమాలలో తొలి షాట్ లో నటించడం ఆయన అదృష్టంగా భావిస్తాడు. ఈ సినిమా కంటే ముందే జంధ్యాల గారు దర్శకత్వం వహించిన ఆహ!నా పెళ్ళంట! చిత్రం విడుదల అయింది. బ్రహ్మానందం, లక్ష్మి అనే ఆమెని వివాహం చేసుకున్నాడు వీరికి గౌతం, సిద్ధార్థ అనే ఇద్దరు కుమారులు సంతానం. ఒకరు ఎంబీఏ చేస్తే మరొకరు బీటెక్ చేశారు. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్లికూతురు అనే చిత్రం వచ్చింది.
బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియటంతో ఈయనకు కూడా ఆ అలవాటు వచ్చింది ఖాళీ సమయాలలో బొమ్మలు గీయడం,పుస్తకాలు చదివే అలవాటు తన తండ్రి నుండి వచ్చింది. కోట్లాది ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం తన మనవడు పార్థ చేసే అల్లరి, చిలిపి చేష్టలకు కడుపుబ్బ నవ్వేస్తుంటాడు.నటుడిగా గుర్తింపు ఇచ్చిన చిత్రం ఆహనా పెళ్ళంట ఈ చిత్రానికి గాను 1987లో ఉత్తమ నంది పురస్కారం అందుకున్నాడు.
దాదాపు 1250 చిత్రాలలో నటించి 2010లో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును సత్కరించింది. ఉత్తమ హాస్యనటుడుగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిలింఫేర్ పురస్కారం, ఆరు సినిమా అవార్డులు, మూడు సైమా అవార్డులు తీసుకున్నాడు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేటు ఆయనకు ప్రధానం చేసింది.