సీమ‌లో తారా స్థాయికి వైకాపా-బీజేపీ వార్!

రాయ‌ల‌సీమ రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల మ‌ధ్య ఎప్ప‌టిక‌ప్పుడు అధిప‌త్య పోరు కొన‌సాగుతుంటుంది. సొంత పార్టీలోనే ఆధిప‌త్యం కోసం యుద్ధానికి త‌గిన సంద‌ర్భాలు కోకొల్లాలు. ఇక అధికార‌-ప్ర‌తిప‌క్ష పార్టీల మధ్య ప‌రిస్థితి ఎలా ఉంటుందో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పటికే అధికార ప‌క్షం నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు జోరుగా న‌డుస్తోంది. ఇటీవ‌లే అనంత‌పురం లో వైకాపా పార్టీలోనే అధిప‌త్య పోరు తెర‌పైకి వ‌చ్చి తెలుగు రాష్ర్టాల్లో సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ్రామ‌ వార్డు వాలంటీర్ల‌ ఎంపిక విష‌యంలో త‌లెత్తిన వివాదం ఆ పార్టీ నాయ‌కులు ఎంపీటీసీ నామినేష‌న్ వేసే స‌మ‌యంలో ఒక్క సారిగా భ‌గ్గుమ‌న్నాయి.

సొంత పార్టీ నాయ‌కులే ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకుని పంచాయ‌తీ..పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో వైకాపా-బీజేపీ నేతల మ‌ధ్య వార్ తారా స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే హ‌ఫీస్ ఖాన్-బీజేపీ రాష్ర్ట కార్య‌ద‌ర్శి హ‌రీష్ ఒకరిపై ఒక‌రిపై ఒక‌రు ఫోలీస్ స్టేష‌న్ ఫిర్యాదులు చేసుకున్నారు. గ‌తంలో ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ త‌న‌పై దుష్ప‌ప్ర‌చారం చేస్తున్నాడ‌ని, మ‌త ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తే విధంగా వ్యాఖ్యానించాడ‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టికి హ‌రీష్ తీసుకెళ్లారు. అటుపై హోమంత్రి, డీజీపీల‌కు ఫిర్యాదు చేసారు. తాజాగా ఈ వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మ‌రింత హాట్ టాపిక్ చేసాడు హ‌రీష్‌.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, స‌హాయ‌మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసారు. మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన వారికి ఎమ్మెల్యే ర‌హ‌స్యంగా చికిత్స చేయించార‌ని ఆరోపించారు. దీంతో అక్క‌డ సీన్ మ‌రింత వేడెక్కింది. ఎమ్మెల్యే మ‌తాల‌ను రెచ్చిగొట్టి రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్న‌ట్లు నేరుగా షా దృష్టికి తీసుకెళ్ల‌డం..మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన వారికి క‌రోనా ట్రీట్ మెంట్ కు ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా పూనుకోవ‌డంపై జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ముస్లీం సొద‌రులు మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన త‌ర్వాత తెలుగు రాష్ర్టాల్లో కేసులు సంఖ్య‌  ఒక్క‌సారిగా పెరిగిపోయింది. దీనికి కార‌ణంగా మ‌ర్క‌జ్ న‌మాజులే ప్ర‌ధాన‌కార‌ణంగా హైలైట్ అయ్యాయి. దీంతో ముస్లీం సొద‌రుల‌పై విమ‌ర్శ‌లు అంతే జోరుగా వ‌చ్చాయి. తాజాగా ఈ వ్య‌వ‌హారంలో ముస్లీమ్ ఎమ్మెల్యే ఉన్నార‌న్న వ్యాఖ్య‌లు అంత‌కంత‌కు మంటెక్కిస్తున్నాయి. అస‌లే ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. రౌడీలు రాజ్య‌మేలుతున్నార‌ని ప్ర‌తి ప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మ‌రీ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్తుందో చూద్దాం.