బిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించిన యూట్యూబర్ హర్ష సాయి.. సంతోష పడుతున్న అభిమానులు!

యూట్యూబ్ వీడియోలు ద్వారా ఎంతో మంది ప్రస్తుతం మంచి గుర్తింపు సంపాదించుకుని వరుస వీడియోలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యూట్యూబర్ హర్ష సాయి ఒకరు. నిజజీవితంలో శ్రీమంతుడు అయినటువంటి హర్ష సాయి యూట్యూబ్ వీడియోల ద్వారా ఏకంగా 4.9 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.అయితే యూట్యూబ్ వీడియోలు ద్వారా ఎంతోమంది పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తే ఈయన మాత్రం యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బును పేదలకు పంచుతూ సహాయం చేస్తున్నారు.

ఈ విధంగా యూట్యూబ్ వీడియో ద్వారా పెద్ద ఎత్తున డబ్బు రావడంతో ఆ డబ్బును అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి మదిలో దేవుడిగా గుర్తింపు పొందారు. కేవలం వేళల్లోనే కాదు అవసరమైతే లక్షల్లో కూడా ఈయన సహాయం చేస్తూ ఎంతో మందికి ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయసహకారాలు చేశారు. ఇకపోతే యూట్యూబ్ ద్వార ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్ష సాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమానికి వెళ్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి స్పందించిన హర్ష సాయి క్లారిటీ ఇచ్చారు.

తనకు ఎంతో ఫ్రీడమ్ గా ఉండడం ఇష్టం అలాంటిది బిగ్ బాస్ ఇంటికి వెళ్లి తన ఫ్రీడమ్ కోల్పోనని అలాంటి కార్యక్రమాలకు తాను వెళ్లే ప్రసక్తి లేదు అంటూ ఈ సందర్భంగా హర్ష సాయి బిగ్ బాస్ కార్యక్రమం గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు .ఈ క్రమంలోనే కొందరు అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ బిగ్ బాస్ కార్యక్రమానికి మీరు వెళ్ళద్దు అంటూ కామెంట్లు చేశారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో తాను పాల్గొనలేదని చెప్పడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.